టీడీపీ పార్టీ పై మరోసారి వైసీపీ నేత, రాజ్య సభ్యులు విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ఉన్మాదుల్లా, ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని… రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దొంగల ముఠాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదన్నారు. అందుకే టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరామని స్పష్టం చేశారు విజయ సాయిరెడ్డి. అసభ్య పదజాలంతో దూషిస్తున్న టీడీపీ నేతలు నారా లోకేష్, పట్టాభి,…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు వారం రోజుల క్రితం మొదలు పెట్టిన బూతు డ్రామాకు నిన్న తెర దించారని సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీలో సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డ్రామాకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. అబద్దాలు, డ్రామాలు, విధానాలను అలవోకగా మార్చడం చంద్రబాబు తెలిసిన ఏకైక విద్య అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే…
వైపీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అసాంఘీక శక్తులకు చంద్రబాబు రారాజు అని, ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి వచ్చారా? ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి వచ్చారా అని ప్రశ్నాంచారు. పట్టాభి బూతు పురాణం వీడియోను రాష్ట్రపతికి చూపించారా? అమిత్ షా మీద రాళ్లు వేసిన వీడియోను చూపించారా? అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు…
కడపజిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, తమకు ప్రజా బలం ఉందని, పోలీసులు అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితమై పోయిందన్నారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి…
ఒకే ఒక్క మాటతో టీడీపీ నాయకుడు పట్టాభి రేపిన వ్యాఖ్యల దుమారంతో రేగిన చిచ్చు ఇప్పుడు ఢిల్లీని తాకింది. వైసీపీ, టీడీపీలు ఎత్తుకు, పైఎత్తు వేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. అయితే అధికార వైసీపీ త్రిముఖ వ్యూహంతో టీడీపీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు. ఏపీలో వ్యవస్థలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది బాబు…
ఆయనో మాజీ మంత్రి. అధికారంలో లేకపోయినా తనదైన ఎత్తుగడలతో చర్చల్లో ఉంటారు. కొంతకాలంగా హైకమాండ్‌తో దూరం పాటిస్తున్నారు. రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అంచనాలు వినిపించాయి. కానీ.. హఠాత్తుగా యూటర్న్ తీసుకుని ఇప్పుడు మళ్లీ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఆయనలో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటి? ఎవరా నాయకుడు? రెండేళ్లుగా గంటా రాజకీయ ప్రయాణంపై చర్చ..! గంటా శ్రీనివాసరావు. విశాఖజిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఒక వెలుగు వెలిగారు.…
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ కు మధ్యలో, సీఎం నివాసానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు మారణాయుధాలతో తెగబడినా.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పోలీసుల…
అమరావతి : తెలుగు దేశం ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తో జరిగే సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యనమల, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు చంద్రబాబు. సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు చంద్రబాబు మరియు టీడీపీ నేతలు. రాష్ట్రపతి తో పాటు ఇంకా ఎవరెవర్ని కలవాలనే దానిపై నేతలతో ఇవాళ చర్చించారు చంద్రబాబు. ఇక…
వైసీపీ సర్కారుపై మరోసారి టీడీపీ నేత లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయాలని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారని సెటైర్ వేశారు. కొన్ని పిల్లులు పులులమని అనుకుని భ్రమపడుతున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని చెప్పిన ఆయన.. తమ పార్టీ కార్యాలయంలో పగిలినవి అద్దాలేనని.. కానీ తమ కార్యకర్తల గుండెలను బద్దలు కొట్టలేరని…