ఆయనో మాజీ మంత్రి. అధికారంలో లేకపోయినా తనదైన ఎత్తుగడలతో చర్చల్లో ఉంటారు. కొంతకాలంగా హైకమాండ్‌తో దూరం పాటిస్తున్నారు. రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అంచనాలు వినిపించాయి. కానీ.. హఠాత్తుగా యూటర్న్ తీసుకుని ఇప్పుడు మళ్లీ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఆయనలో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటి? ఎవరా నాయకుడు? రెండేళ్లుగా గంటా రాజకీయ ప్రయాణంపై చర్చ..! గంటా శ్రీనివాసరావు. విశాఖజిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఒక వెలుగు వెలిగారు.…
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ కు మధ్యలో, సీఎం నివాసానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు మారణాయుధాలతో తెగబడినా.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పోలీసుల…
అమరావతి : తెలుగు దేశం ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తో జరిగే సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యనమల, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు చంద్రబాబు. సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు చంద్రబాబు మరియు టీడీపీ నేతలు. రాష్ట్రపతి తో పాటు ఇంకా ఎవరెవర్ని కలవాలనే దానిపై నేతలతో ఇవాళ చర్చించారు చంద్రబాబు. ఇక…
వైసీపీ సర్కారుపై మరోసారి టీడీపీ నేత లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయాలని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారని సెటైర్ వేశారు. కొన్ని పిల్లులు పులులమని అనుకుని భ్రమపడుతున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని చెప్పిన ఆయన.. తమ పార్టీ కార్యాలయంలో పగిలినవి అద్దాలేనని.. కానీ తమ కార్యకర్తల గుండెలను బద్దలు కొట్టలేరని…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు ఈ నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ పాలన, వైసీపీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు నేను మూడు సార్లు నిరాహార దీక్ష చేశాను. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద…
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేశినేని నాని ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో కేశినేని నాని పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు శుక్రవారం నాడు ఎంపీ కేశినేని నాని సంఘీభావం ప్రకటించారు. తాజా పరిణామంతో తెలుతు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని అలక వీడినట్లే అని అభిప్రాయపడుతున్నారు. Read Also: టీడీపీని…
టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్ క్రమంగా మసకబారుతుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసే బాబు గత కొంతకాలంగా రాజకీయంగా విఫలం అవుతున్నారు. ట్రెండ్ తగ్గట్టుగా చంద్రబాబు వ్యూహాలు ఉండకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. 2020లోనూ పాతకాలం నాటి వ్యూహాలనే చంద్రబాబు నమ్ముకోవడంతో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఇమేజ్ ఏపీలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలోనూ డ్యామేజ్ అవుతుండటం శోచనీయంగా మారింది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నా…
ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి పట్టాభిరామ్ ను విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు, గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న న్యాయమూర్తి మూర్తి పట్టాభిరామ్ కు నవంబర్ 2 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పట్టాభిరామ్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఈ రోజు ఉదయం తరలించారు.…
ఏపీలో రాజకీయ నాయకులు నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్టు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు తారాస్థాయి చేరకున్నాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష ప్రారంభించారు. మరో వైపు పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నాయకులు జనాగ్రహా దీక్షకు దిగారు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు దిగారు. ఎప్పడూ వివాదాలతో నిద్రలేచే ఆర్జీవీ ఏపీ రాజకీయాలపై ట్విట్టర్…