కుటుంబ సభ్యులను కించపరటం తగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగి స్తున్నాయన్నారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చే స్తుంటే ప్రజా ప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమ ర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరంగా ఉందని, ప్రజా సం క్షేమం నాయకులకు పట్టదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం…
ఏపీ అసెంబ్లీలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్రెస్మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తావించారు. తాను సభలోకి వచ్చే సమయంలో చంద్రబాబు ఎమోషనల్గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు సంబంధం లేని విషయాలు తీసుకువచ్చి రెచ్చగొట్టారని జగన్ ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.…
టీడీపీ పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో భోరున విలపించారు చంద్రబాబు. అనంతరం వైసీపీపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని… రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను హింసించేవారు.. బూతులు తిట్టారు.. అయినా భరించామని.. బీఏసీలో అచ్చెన్నాయుడుతో వ్యంగ్యంగా సీఎం జగన్ మాట్లాడారని ఆగ్రహించారు. అన్నీ భరించి అసెంబ్లీకి వెళ్తే.. నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని… నా భార్య…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై వ్యూహాం పై చర్చించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తు న్న పనులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. టీడీపీ ప్రతిపాదించిన 27 అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టాలని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీనిపై ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీయాలని…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పును కళ్లారా చూశామని, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని ఆయన మర్యాద పూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి మినహాయించి అన్ని చోట్లా గెలిచామన్నారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారన్నారు. ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి…
వైసీసీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందాలకు వెళ్లాయన్నారు. కుప్పం కోట తొలిసారి బద్ధలైంది అన్నారు. మా ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ఓట్లు అడిగాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పంలో 8 వేల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. ఐఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులంటే చంద్రబాబు…
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎస్ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ సంద ర్భంగా వారు వైసీపీ పై ధ్వజమెత్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. ఇప్పటికే పలు ఎన్నికల్లో అధి కార దుర్వినియోగాని పాల్పడుతున్నారని వారు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. కొండపల్లి, కుప్పం, నెల్లూరుల్లో ఎన్నికల ప్రచారంలో వార్డు వలంటీర్లు పాల్గొంటున్నారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చిన టీడీపీ నేతలు. వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారంటూ…
రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా రైతులను వాడుతున్నారని మం త్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అమరావతి రైతుల పాదయాత్ర, చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయాత్రకు చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని మంత్రి అన్నారు. చంద్రబాబు తాబే దార్లు న్యాయమూర్తులకు కళ్లకు గంతలు కట్టి యాత్ర చేస్తున్నారన్నా రు. పాదయాత్రకు…