గత ప్రభుత్వ హస్తాల్లో ఐదు సంవత్సరాలు రాష్ట్రం విలవిల్లాడిందని., అధికారం దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని తీవ్ర కష్టాల్లో ఉంచారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన ఆరోపించారు. అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వాడాలని., ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి ఫలితాలు ఎప్పుడు చూడలేదని ఆయన పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల సమయంలో జరిగిన పరిపాలన చూసే ఈ ఫలితాన్ని ప్రజలు ఇచ్చారని ఆయన తెలిపారు. Nara Lokesh: బాధ్యత…
Lok Saha Election Result: ఎన్నికలకు ముందు 400 దాటాలని ప్రధాని నరేంద్ర మోడీ నినాదాలు చేశారు. అయితే నేడు దేశవ్యాప్తంగా ఈవీఎంలు తెరుచుకునే సరికి బీజేపీ 250 సీట్లలోపే ఇరుక్కుపోయిందని అన్నారు.
Chandrababu Naidu will take oath as CM in Amaravati: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) విజయం దాదాపుగా ఖాయమైంది. 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. టీడీపీ రెండు సీట్లను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారట. నాలుగోసారి సీఎంగా…
Huge Celebrations at NTR Bhavan: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) సునామీ సృష్టిస్తోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (88)ను ఇప్పటికే దాటేసింది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ నుంచే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కనబర్చారు. కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతుండడంతో.. కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ…
వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన విషయం విదితమే.
ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
ప్రధాని మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న.. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మోడీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.
విజయవాడ బందర్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ముగిసింది.. గంట పాటు బందర్ రోడ్డులో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోడీ.. ఈ రోడ్ షోలో వాహనంపై ప్రధాని మోడీకి ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిలబడి.. దారిపొడవునా.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.. ప్రధాని మోడీ రోడ్ షో.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిలో కొత్త జోష్ నింపిందని కూటమి నేతలు చెబుతున్నారు..
జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది.. జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ.. దేశంలో ఏ నాయకుడికి లేదు, ఉండదు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగన్ చేయలేని స్కీంలు.. చంద్రబాబు ఆయన బాబు కూడా చేయలేడని పేర్కొన్నారు.