Home
Chandrababu Naidu
Chandrababu Naidu News
-
చంద్రబాబు కుప్పం కోటకు బీటలు?
చంద్రబాబు కంచుకోట కుప్పం కోటలు బీటలు వారుతున్నాయా? మెజార్టీ తగ్గడం, పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి అందుకు సంకేతాలా? టీడీపీ వెనకబాటు ఇప్పటి వరకేనా.. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాగే ఉంటుందా? ఏం జరుగుతోంది కుప్పంలో…! కుప్పం బాబు కోటకు బీటలు వారుతున్నాయా?నాటి పంచాయతీ ఎన్నికల్లో 89లో టీడీపీకి దక్కింది 14..! కుప్పం… చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి ఆయన ఏడుసార్లు వరసగా గెలుస్తున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లకుండానే గెలిచేస్తున్నారు చంద్రబాబు. అంటే… అక్కడ… -
చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది !
తిరుపతి : జగన్ కు సమానంగా లోకేష్ ను తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు పిచ్చి ఆలోచన అని… గత ఎన్నికల కన్నా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవ చేసుకోవాలి..అదే మంచిదన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలోనే చంద్రబాబు మళ్లీ పోటీ చేయాలని కోరుకుంటున్నానని… జగన్ చేసిన అభివృద్ధి వల్లే కుప్పంలో భారీ విజయం సాధించామని వెల్లడించారు. గత పాలకులు ఎన్నో ఏళ్లుగా స్థానిక పోరు జరపకుండా… -
ఆ సమయంలో బాబు వెంట నడిచిన ఏకైక నాయకుడికి ఏమైంది?
మంత్రిగా.. ఎంపీగా చేసిన ఆయన సడెన్‌గా పొలిటికల్ తెర నుంచి కనుమరుగయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ నల్లపూసై చర్చగా మారారు. ఆయనది మౌనమా? వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏమా కథ? టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? నిమ్మల కిష్టప్ప. అనంతపురం జిల్లాలో సీనియర్ టీడీపీ నాయకుడు. సుదీర్ఘకాలం మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2019లో హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఓడిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో..… -
చంద్రబాబుకు షాక్ : నారావారిపల్లెలో వైసీపీ గెలుపు
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ దూసుకుపోతుంది. ఆ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లోనూ వైయస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్సీపీకి 17, టీడీపీకి 2 గెలిచాయి. అలాగే…. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. ఇక శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్సీపీ, 1 చోట టీడీపీ గెలుపొందాయి. మరో 6 చోట్ల ఫలితాలు… -
చంద్రబాబు ఇంటిపై దాడి : గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు !
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి రాజ్‌భవన్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.వైసీపీనేతలు దాడికి పాల్పడుతున్న దృశ్యాల సీసీ టీవీ ఫుటేజీని కూడా వినతిపత్రంతో పాటు గవర్నర్ కార్యదర్శికి సమర్పించామన్నారు. టీడీపీ కార్యకర్తలు తన కారు అద్దాలు పగులగొట్టారన్నారు జోగి రమేష్.చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు వార్నింగిచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.… -
‘అలా ముందుకు పోదాం తమ్ముళ్లు’.. బాబు ప్లాన్ ఇదేనట?
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ మధ్య అస్సలు కాలం కలిసి రావడం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయం బెడిసి కొడుతోందని సొంతపార్టీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ, అపార చాణిక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికలు ఛాలెంజ్ గా మారాయి. ప్రతిపక్షంలో ఉండటం టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో టీడీపీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకోవడం ఆయనకు మింగుడుపడటం లేదు. దీంతో జగన్ రెండోసారి… -
ఏపీ ఫార్ములా: జగన్, చంద్రబాబుల ‘గెలుపే’ నిర్ణయిస్తుంది..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది. తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా… -
చంద్రబాబు మౌనం వెనక వ్యూహం.. ఇదే అయితే పార్టీ శ్రేణులకు పండగే..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారా? పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే క్రమంలో.. ఆయన సరికొత్త ఆలోచనలు చేస్తున్నారా? సరికొత్త గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు.. ఆయన వ్యవహారశైలి అవుననే సమాధానం చెబుతోంది. సందర్భానుసారం మాట్లాడ్డం.. ముఖ్యమైన విషయాలపై ట్వీట్లు చేయడం తప్ప.. పెద్దగా హడావుడి చేయకుండా.. ఆయన ఎదురుచూస్తున్న తీరు సైతం.. సరికొత్త వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. చంద్రబాబు… -
కడప జిల్లా నేతలతో ముగిసిన చంద్రబాబు భేటీ… కీలక నిర్ణయాలు…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. పార్టీకి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. జమ్మలమడుగు నియోజక వర్గం టీడీపి ఇన్‌చార్జీగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని నియమించాలని ఈ చర్చలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. అదే విధంగా బద్వేల్ ఉప ఎన్నికపై కూడా భేటీలో చర్చించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ను… -
లక్ష్మీ పార్వతీ.. ఇలా మాట్లాడేది మీరేనా..??
ఆంధ్రా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.. దూకుడుగా మాట్లాడుతుంటారు. అది పార్టీ వ్యూహమైనా సరే.. వ్యక్తిగత ఆవేశమైనా సరే.. తమ పార్టీని ఎవరైనా విమర్శిస్తే వాళ్లు చూస్తూ ఊరుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ఆ పార్టీ నాయకులు అలాగే ప్రవర్తించారు కూడా. ఇందులో ముఖ్యంగా.. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా వంటి నేతలు.. ఈ దూకుడును ముందుకు తీసుకుపోయారు. ఈ లిస్ట్ లో.. తాజాగా.. అత్యంత నెమ్మదస్తురాలిగా మాట్లాడే… లక్ష్మీపార్వతి సైతం చేరిపోయారు. ఎన్టీఆర్…
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!