ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన–సాంకేతిక పరిశోధనల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST)’ పేరుతో తిరుపతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలోని IIT–IISER కాంబినేషన్‌తో AP FIRST రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక పరిశోధనలు, ఇన్నోవేషన్‌కు వేదికగా నిలిచేలా ప్రణాళికలు…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు నారావారి పల్లెలో పర్యటిస్తున్నారు. ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రూ.140 కోట్లతో శంకుస్థాపనలు, రూ.20 కోట్లతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
AP FiberNet Case: విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అధికారులపై రూ.300 కోట్లకు పైగా టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని…
CM Chandrababu Delhi visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహాయాలపై కీలక చర్చలు జరపనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు.. అదే రాత్రి కేంద్రంలోని కీలక నాయకులను, ఉన్నతస్థాయి అధికారులను ఆయన కలిసే…
CM Chandrababu: అమరావతి రైతుల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి డాక్టర్ నారాయణ పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వ కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని సీఎం పేర్కొన్నారు. వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. రైతులు చేసిన త్యాగం…
CM Chandrababu: శ్రీ సత్యసాయి బాబా సేవా స్పూర్తి ప్రపంచానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి నారా లోకేష్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస.. ఇవే సత్యసాయి జీవన సూత్రాలని, ఇవి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే విలువలని సీఎం గుర్తుచేశారు. సత్యసాయి సేవలు అపారమైనవి అని పేర్కొన్నారు. Read…
Ballikurava Quarry Tragedy: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో అంచు విరిగి పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతులు ఒరిస్సాకు చెందిన కార్మికులుగా గుర్తించారు.
Chandrababu Naidu’s Bail and Petition Tomorrow: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్‌లపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై ఈరోజు తమ వాదనలు వినాలని బాబు తరఫు లాయర్లు కోరారు. ఈరోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని ఏసీబీ కోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. బుధవారం నుంచి తాను సెలవులపై…
Nara Chandrababu Naidu Petition Today in Supreme Court: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ స్కామ్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన పిటిషన్‌ను…