తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు గుండె సమస్య ఉన్నట్లు తేలింది. చంద్ర బాబు కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలను హైకోర్టుకు ఆయన లాయర్లు సమర్పించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 25 సంవత్సరాల నుంచి చంద్రబాబుకి చర్మ వ్యాధులు ఉన్నాయని.. ఇది అందరికీ తెలుసన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. ఆయనకు చల్లటి వాతావరణం అవసరమని వారు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యలో ప్రభుత్వ వైద్యులతో కలిసి జైళ్ల శాఖ డీఐజీ మీడియా సమావేశం నిర్వహించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎవ్వరుబడితే వారే మాట్లడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రెండవ రోజు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. చంద్రబాబు హెల్త్ బులెటిన్‌నుసెంట్రల్ జైల్ ఇంఛార్జి సూపరిండెంట్ రాజ్‌కుమార్ విడుదల చేశారు.
చంద్రబాబు భద్రత, ఆరోగ్యానికి సంబంధించి జైల్లో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. జైల్లో చంద్రబాబుకు ఆరోగ్యపరంగా, భద్రతాపరంగా ఎలాంటి సమస్య లేదన్నారు. మొదటి నుంచి ఆయనను హైప్రొఫైల్ ఖైదీగానే ట్రీట్ చేస్తున్నామన్నారు.