పడవ ప్రమాద ఘటనను టీడీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు హోంమంత్రి తానేటి వనతి.. తెలుగుదేశం పార్టీ నేతలు అడిగితే ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పంటు ఢీకొనడంతో పడవలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు కొందరు నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు లైఫ్ జాకెట్ల సాయంతో వారిని రక్షించారు.. ఈఘటనలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, కొందరు పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు..…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా పర్యాటనలో అపశృతి చోటు చేసుకుంది.. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా నీటిలో పడిపోయారు టీడీపీకి చెందిన 15 మంది నేతలు.. చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.. మాజీ మంత్రులు, టీడీపీ నేతలు నీటిలో పడిపోయారు.. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడి తడిసి ముద్దయ్యారు.. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.. నీటిలో పడినవారిలో పోలీసు…