ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?.. లేదా ప్రజలందరి కోసం పనిచేస్తారా? అని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. తన కొడుకును సీఎం చేసుకోవటానికి నారా లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారన్నారని, ప్రశ్నించిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులుపెట్టి జైళ్లకు పంపిస్తున్నారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కు నిధులు కేటాయింపులు చేయకుండా మంత్రి నిమ్మల మాటలతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు…