Akali Dal: శిరోమణి అకాలీదళ్ పార్టీకి షాక్ తగిలింది. అత్యంత కీలమైన చండీగఢ్ ఎంపీ స్థానం నుంచి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న హర్దీప్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు.
ఏప్రిల్ 21న మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ లలో 2 గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ తమ 7 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నేడు డబుల్ హెడ్డేరు నేపథ్యంలో మ్యాచ్…
చండీగఢ్ మేయర్ ఎన్నికపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమారే మేయర్‌గా ప్రకటించింది.
చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం షాకిచ్చింది. మేయర్ ఎన్నిక (Chandigarh Mayoral Polls) సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Chandigarh Mayor Row: చండీగఢ్ మేయర్ పోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాని ప్రయత్నించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థి చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకి ఎక్కింది. ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు ముందే మేయర్ అభ్యర్థి, బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం రాజీనామా చేశారు.
Blood Cancer: అత్యంత తీవ్రమైన క్యాన్సర్లలో ‘బ్లడ్ క్యాన్సర్’ ఒకటి. సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో వైద్యులు కీమోథెరపీని ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే, చండీగఢ్ వైద్యులు మాత్రం కీమోథెరపీ ఉపయోగించకుండా ఒక రకమైన రక్త క్యాన్సర్ చికిత్సను కనుగొన్నారు. అక్యూట్ ప్రోమిలోసైటిక్ లుకేమియా (ఏపీఎల్)తో బాధపడుతున్న రోగులు చికిత్స తర్వాత పూర్తిగా నయమయ్యారని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైద్యులు తెలిపారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయొచ్చని. తిమ్మిని బమ్మిని చేసి అడ్డదారుల్లో వెళ్లే ఆఫీసర్స్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన పనికి సుప్రీంకోర్టు (Supreme Court) గట్టిగానే చీవాట్లు పెట్టింది.
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంఢీగఢ్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. తొలిపోరులోనే కూటమి చతికిలపడింది. కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికే ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. అయినా కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్‌గా విజయం సాధించారు.
Rajasthan : ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, చండీగఢ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు, ఒక సహచరుడిని అర్థరాత్రి చండీగఢ్‌లో అరెస్టు చేశారు.