ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా వున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేజ్రీవాల్ నివాసంలో కేసీఆర్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు కేసీఆర్, కేజ్రీవాల్ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం చండీగఢ్ బయలు దేరారు సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్. కేసీఆర్ కారులోనే బయలు దేరారు కేజ్రీవాల్. ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చండీగఢ్‌కు పయనమయ్యారు. గాల్వన్ వ్యాలీ అమరవీరుల జవానులకు నివాళులు అర్పించారు కేజ్రీవాల్, కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. అనంతరం రైతు ఉద్యమంలో చనిపోయిన 600 రైతు…
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. శనివారం సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో సమావేశం అయిన ఆయన రెండున్నర గంటల పాటు దేశ రాజకీయాలపై ముచ్చటించారు. ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాతో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు. తాజాగా ఈ రోజు సీఎం చంఢీగడ్ వెళ్లనున్నారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇక, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. పలు కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను తక్షణం పంజాబ్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తోంది పంజాబ్ సర్కార్.. దీనిపై పంజాబ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతం నిర్వహణలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. పంజాబ్…
పంజాబ్ రాజధాని చంఢీఘర్‌లో గత 36 గంటలుగా అంధకారం అలుముకున్నది. చంఢీఘర్‌లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిరసన దీక్షలు చేస్తున్నారు. విధులను బహిష్కరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించి 48 గంటల పాటు నిరసనలకు దిగడంతో చంఢీఘర్ అంధకారంగా మారిపోయింది. ఆసుపత్రులు, కార్యాలయాలు, గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం అందక ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంధకారంగా మారిపోయాయి. ఆసుపత్రుల్లో ఉన్న జనరేటర్ సౌకర్యం…
రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొంతమంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను ప్రత్యేక పరిశీలకులుగా ఆహ్వానించాలని అన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆహ్వానం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పరిశీలకుడిగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్, రిటైర్డు ఐ.ఎ.ఎస్. సి. పార్థసారధి చండీగఢ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను గమనిస్తే, SEC అనుసరించే వినూత్న చర్యలు మరియు ఉత్తమ పద్ధతులను…
రోజురోజుకు మహళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. నడిరోడ్డుపై మహిళలు తిరగడమే పాపమైపోయింది. కఠిన చర్యలు లేక ఆకతాయిల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. తాజాగా కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఒక మహిళ ప్రాణం పోయింది. కూతురిని ఏడిపించిన యువకులను ఆ తల్లి అడ్డుకుంది.. అదే ఆమె పాలిట యమపాశమైంది. తమనే అడ్డుకుంటావా అంటూ ఆ యువకులు ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన చండీగఢ్ నడిరోడ్డుపై జరిగింది. వివరాలలోకి వెళితే.. చండీగఢ్ ప్రాంతానికి చెందిన నిమ్రా…
ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణమైన విషయమే.. ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఢిల్లీలో రెండోసారి పీఠం ఎక్కిన ఆ పార్టీ.. ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.. అయితే, ఆప్ మాజీ ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ.. ఇవాళ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. గతంలో బటిండా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు.…
నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్టైలే వేరు.. ఈ టీమిండియా మాజీ క్రికెటర్‌కు సిక్సర్ల సిద్ధూగా పేరు ఉండగా.. ఇప్పుడు తన పనిలోనూ.. ఆ సిక్సర్లను గుర్తు చేస్తున్నారు.. ఏకంగా స్టేజ్‌పైనే సిక్సర్ బాదినట్టు పోజులు ఇచ్చారు.. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.. స్టేట్‌పైన సిద్ధూ సిక్స్ కొట్టడం ఏంటనే విషయానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆ తర్వాత 62 మంది ఎమ్మెల్యేలతో బలప్రదర్శన కూడా…
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, కృష్ణ జింకలు వేటాడిన కేసు… ఇలా సల్మాన్ ఖాన్ కు పోలీస్ పిలుపులు, కోర్టు కష్టాలు కొత్తేం కాదు. కానీ, ఈసారి అతడి చెల్లెలు అల్వీరా ఖాన్ కూడా చిక్కుల్లో పడింది. ఛంఢీఘర్ లోని ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ స్థానిక పోలీసుల్ని ఆశ్రయించాడు. ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ నేమ్ తో సల్మాన్ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అదే పేరుతో జ్యుయెలరీ అమ్మటం కూడా చేస్తుంటారు. ఛంఢీఘర్ లోని బిజినెస్ మ్యాన్…
తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినులపై అత్యాచారం చేసిన కేసులో హర్యానాలో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద బాబా.. డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. కరోనాబారినపడ్డారు.. ఆదివారం ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఇవాళ వచ్చిన రిపోర్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయియ్యింది.. కడుపులో నొప్పిగా ఉండడంతో.. రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్)లో పరీక్షలు చేయించారు. ఆ తర్వాత గురుగ్రామ్‌లోని మెదంత ఆసుపత్రికి తరలించారు జైలు…