వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ విజయాన్ని సమీప బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని.. ఆమె కుటుంబ ఆస్తులు కూడా తప్పుగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సందేశ్‌ఖాలీ దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఉగాది రోజున హైకోర్టు విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.
రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య ను మంత్రి కేటీఆర్ అభినందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్ర