తెలంగాణ రైతాంగ పోరాట యోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి ( సెప్టెంబర్ 26) సందర్భంగా వారందించిన పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అణిచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, అస్థిత్వ ఉద్యమంలో, స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో, పెద్ద ఎత్తున బహుజనులు భాగస్వామ్యం కావడం వెనక నాటి వారి పోరాట…