బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమ య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన 16 జిల్లాల్లో కడలూరు, విల్లుపురం, చెంగల్‌పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరుతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇక పెరంబలూరు, అరియలూరు, ధర్మపురి, తిరప త్తూరు, వెల్లూరు, రాణిపేట్‌లలో…
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. వర్షప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్11 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిం చింది. ఒక వేళ ఇప్పటికే ఎవరైనా చేపల వేటకు వెళ్లి ఉంటే వారిని వెంటనే వెనక్కి తిరిగి రావాలని…