ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (60) లేటు వయసులో మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రియురాలు లారెన్ శాంచెజ్ (54)ను త్వరలోనే ఆయన వివాహం చేసుకోనున్నారు. క్రిస్మస్ రోజున వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఈరోజు భారీ మార్పు చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. వేదికపై ఓ చిన్నారిని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
జూన్ 9న ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్ని రహదారులు రాష్ట్రపతి భవన్‌కు దారి తీస్తాయి,ఇది మరోసారి ఆకర్షణీయంగా మారుతుంది. ఎన్నో చోట్ల నుంచి విదేశీ ప్రధానీలు మరియు అధ్యక్షులు హాజరు కానున్నారు. వచ్చే అతిథులకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రుచికరమైన వంటకాలతో సాంప్రదాయ శాఖాహారం థాలీని అందజేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.ఆ వంటకాలు గురించి తెలియాలి అంటే ఈ వీడియో చుడాలిసిందే.
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆమెకు భారీ ఘన స్వాగతం లభించింది. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు
రేపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో.. రేపు మధ్యహ్నం 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందర్యరజన్ ప్రమాణం చేయించనున్నారు. ఇకపోతే.. రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు కూడా ప్రమాణం…
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 2024 జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు. అంతేకాకుండా ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.