విలక్షణ నటుడు ఆశిష్ విద్యార్థి మరియు ఆయన భార్య రూపాలి బరూవా ప్రమాదానికి గురయ్యారనే వార్త సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ ఘటనపై ఆశిష్ విద్యార్థి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ అసలు ఏం జరిగిందో వివరించారు. శుక్రవారం రాత్రి గువహటిలో వారు రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఒక బైక్ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రూపాలికి గాయాలయ్యాయని, వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆమె వైద్యుల…