మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. టీఆర్‌ఎస్ నేత సోము భరత్ కుమార్ ఫిర్యాదుతో ఈసీఐ స్పందించింది. కోమటిరెడ్డి కంపెనీ ఖాతాల నుంచి 5 కోట్ల 24 లక్షల రూపాయలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.