ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవనంలోని మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడి 19 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు స్కూటర్‌పై కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు యువకుడి తలపై పడింది. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) జరిగింది. పక్కనే నిల్చున్న మృతుడి స్నేహితుడికి కూడా ఏసీ తగలడంతో అతను కింద పడిపోయాడు.
బెంగళూరులో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. మహిళను బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. వాకింగ్‌కు వెళ్లేందుకు స్నేహితురాలి కోసం నిరీక్షిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక వ్యక్తి అమెను పట్టుకుని లైంగికంగా వేధించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా వద్ద కదులుతున్న రైలు ముందు దూకి మే 27 న ఒక మహిళ మరణించింది. ఆగ్రాలోని రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ లోని సీసీటీవీ నిఘా కెమెరాలో రికార్డయింది. రైలు స్టేషన్ కు చేరుకోగానే రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్న తన ప్రియుడితో గొడవ పడుతూ రైలు ట్రాక్…
కజకిస్థాన్ మాజీ ఆర్ధిక మంత్రి కువాండిక్ బిషింబాయేవ్ (44) తన భార్య సాల్టానాట్ (31) ను కొట్టి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. సాల్టానాట్ నుకెనోవా గత నవంబర్‌లో ఓ రెస్టారెంట్‌లో శవమై కనిపించింది. ఆ రెస్టారెంట్‌లో 8 గంటలపాటు తనభార్య సాల్టానాట్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మరణించింది.
కొత్త సంవత్సరం వేళ ఢిల్లీలో ఓ యువతిని కారుతో దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే మరో భయంకరమైన ఘటన హర్యానాలో జరిగింది. తన ద్విచక్రవాహనం ఎక్కడానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఓ మహిళను హెల్మెట్‌తో దారుణంగా చితకబాదాడు.
దేశంలో ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు మాత్రం రక్షణ ఉండడం లేదు. నడిరోడ్డుపై ఆడవారు ఒంటరిగా తిరిగే రోజులు ఇంకా రాలేదని తెలుస్తోంది. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులు ఇలా ఒకటని చెప్పలేకుండా ఉన్నాం.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఒక గ్యాంగ్ ముగ్గు మహిళపై దాడికి తెగబడ్డారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే.. ఢిల్లీలోని.. షాలిమార్‌బాగ్‌లో అర్ధరాత్రి ముగ్గురు మహిళలు కారు…