చిట్టీల పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో రూ. 100 కోట్లు వసూళ్లు చేసి పుల్లయ్య పరారైన పుల్లయ్యను.. బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచాడు చిట్టీల పుల్లయ్య. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 సంవత్సరాల కిందట నగరానికి వచ్చారు. బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ సమీపాన సీ-టైపు కాలనీలో నివాసం ఉన్నారు. చదువు లేకపోవడంతో పుల్లయ్య కొన్ని నెలలు అడ్డాకూలీగా పనిచేశాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకొని కూలి పని మానేసి 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.
READ MORE: Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ అనారోగ్యంతో మృతి…
రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలను నిర్వహించేవాడు. తొలుత గుడిసెల్లో నివాసమున్న పుల్లయ్య కొద్దికాలంలోనే కోటీశ్వరుడిగా మారాడు. పెద్ద భవంతి కట్టాడు. చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశచూపి తన వద్దే ఉంచుకునేవాడు. మళ్లీ అదే సభ్యులతో చిట్టీలు వేయించేవాడు. దీంతో పాటు తెలిసిన వారి వద్ద వడ్డీకి రూ.కోట్లు అప్పుగా తీసుకున్నాడు. సుమారు రెండు వేల మంది చందాదారులు ఇతడి వద్ద చిట్టీలు వేశారు. చిట్టీలు కట్టిన వారికి గత ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తానని చెప్పిన పుల్లయ్య అదే నెల 21నే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. వారు తమ సెల్‌ఫోన్లను స్విచ్‌ఆఫ్ చేశారు. దీంతో బాధితులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నిందితుడిని పట్టుకున్నారు.
READ MORE: SLBC Tunnel: బిగ్ అప్డెట్.. టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు..