Fake Certificates : రంగారెడ్డి జిల్లాలోని మంచాల ఎమ్మార్వో ఫిర్యాదుతో కొన్ని ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన విశేషాలు బయటకు వచ్చాయి. తెలియని వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండానే కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన పత్రాలను ఎమ్మార్వో అనుమతి లేకుండానే జారీ చేస్తున్నట్లు మంచాన ఎమ్మార్వో ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది మోసం. ఈ నేపథ్యంలో మంచాన ఎమ్మార్వో కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు పనిచేస్తున్న సురేష్, అలాగే మీసేవ సెంటర్ రవి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎమ్మార్వో.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ రూ. 93.80 కోట్లు.. విజేత భారత్‌కు ఎంతంటే?
ఈ ఫిర్యాదుల భాగంగా ఎమ్మార్వో పోలీసులకు తెలిపిన ప్రకారం.. తన దృష్టికి ఎలాంటి విషయాలు రాకుండానే ఆదాయ, కుల దృవీకరణ పత్రాలను వారు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయంతో పోలీసులు రవి, సురేష్ లపై కేసు నమోదు చేశారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.
MODI: ఫోన్లో భారత్ జట్టుతో మాట్లాడిన ప్రధాని మోడీ..ఏమన్నారంటే..?