కరీంనగర్ జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. వీణవంక మండలానికి చెందిన మైనర్ బాలికను రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురిమిండ్ల శ్రీనివాస్ (32) పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాలిక కుటుంబ సభ్యులు వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతి చేసిన…
కూకట్ పల్లి అంకుర హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్ సంధ్యకు చేధు అనుభవం ఎదురైంది. నిజంపేటకు చెందిన సంధ్య డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ట్విన్స్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత MICU కి షిఫ్ట్ చేశారు. కాసేపటికే బాలింతకు చలి తీవ్రత పెరగడంతో కాళ్లకు హీట్ ప్యాడ్స్ కట్టారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది హీట్ ప్యాడ్స్ ను తీసేయడం మర్చిపోయారు.…
AAP MLA Dinesh Mohaniya: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీస్ కేసు నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. సదరు మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారిపోయింది.
ప్రజా సేవకుడు అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది వాళ్లే మర్యాద తప్పి ప్రవర్తిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఓ సీపీఎం నాయకుడు పాడు బుద్ధి ప్రదర్శించాడు. ఇంటర్వ్యూకు వచ్చిన ఒక మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు.
అమీన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. అమీన్‌పూర్ వాణినగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో.. ఇవాళ కాటసానికి చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. మరోవైపు.. మల్లంపేట చెరువులో విల్లాలు నిర్మించిన విజయలక్ష్మిపై కూడా కేసు నమోదు అయింది. హైడ్రా కూల్చివేతలపై కాటసాని స్పందించారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చిన బల్డింగ్కు తనకు సంబంధం లేదన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో వికలాంగులను ఎగతాళి చేసినందుకు మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, గురుకీరత్ మాన్‌లపై ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ మాజీ జీవన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. అతడితో పాటు అతని కుటుంబ సభ్యుల పై చేవెళ్ల పీఎస్ లో కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేశారని బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఎర్లపల్లి లో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశారు.
చంద్రబాబు పై మరో కేసు నమోదు అయింది.. ఉచిత ఇసుక విధానం పేరిట గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు.
యూసుఫ్ గూడ బస్తీలో యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని సినీనటి కరాటే కల్యాణి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి దాడిచేసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. ఆయన వీడియోలకు మంచి ఆదరణ ఉంది. నిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కల్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని…