యూసుఫ్ గూడ బస్తీలో యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని సినీనటి కరాటే కల్యాణి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి దాడిచేసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. ఆయన వీడియోలకు మంచి ఆదరణ ఉంది. నిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కల్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డిపై సినీనటి కరాటే కల్యాణి దాడి చేసింది. నడిరోడ్డుపై అతడిని పట్టుకుని చితకబాదింది.
ప్రాంక్ పేరుతో మహిళల పై ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తున్నాడు అంటూ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు అంటూ దాడి చేసింది. ఒంటరిగా వెళ్తున్న మహిళలను రెచ్చగొట్టి కోరికలు తీర్చుకుంటున్న శ్రీకాంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీకాంత్ రెడ్డి చెంప ఛెల్లు మనిపించింది. ఈ గొడవలో ఆమెతో పాటు మరోవ్యక్తి కూడా పొల్గొన్నాడు. కాగా.. శ్రీకాంత్ రెడ్డి పై కరాటే కల్యాణి దాడి చేస్తుండగా.. శ్రీకాంత్ తిరిగి ఆమెపై దాడి చేశాడు. అనంతరం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది కరాటే కల్యాణి. ప్రతిగా శ్రీకాంత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
స్థానికులకు అక్కడ ఏంజరుగుతుందో అర్ధంకానీ స్థితిలో చూస్తుండిపోయారు. మరికొందరైతే ఘటనజరిగే సన్నివేశాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈవీడియో చూసిన వాల్లందరూ కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు. మీరైతే అబ్బా.. అంటూ సినిమా తీయడం సమాజసేవ అంటారు. కానీ.. మేము తీస్తే తప్పా అంటూ కమెంట్లు చేస్తుంటే.. మరికొందరు ఏదైనా వుంటే పోలీసులకు చెప్పాలి అంతే గానీ ఇలా గొడవలు పెట్టుకుంటారా అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఈవీడియో షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.