James Webb Telescope Captures Images Of Cartwheel Galaxy: జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వాంతరాల్లోని అద్భుతమైన ఫోటోలను భూమికి పంపిస్తోంది. మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గెలాక్సీ నిర్మాణాలను, నెబ్యులాలను క్యాప్చర్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా చాలా స్పష్టతతో కూడిన అబ్బురపరిచే చిత్రాలను అందిస్తోంది. దీంతో విశ్వం తొలినాళ్లలో గెలాక్సీల నిర్మాణం, నక్షత్రాలు పుట్టుక, బ్లాక్ హోల్స్ గురించిన మరింత సమాచారాన్ని జెమ్స్ వెబ్ అందిస్తోంది