Plane-Car Accident: రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Small Plane crashes into car in America: అగ్ర రాజ్యం అమెరికాలో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరు విమానంలో ఉండగా.. ఒకరు కారులో ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో ఓ సింగిల్-ఇంజిన్ లాంకైర్ Iv-P ప్రాప్‌జెట్ విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్ అయ్యింది. అయితే దానిని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం రన్‌వేపై చివరి వరకు వచ్చినా.. ఆగలేదు. బుల్లి విమానం ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని ఈస్ట్‌బౌండ్ వర్జీనియా పార్క్‌వేపై వెళుతున్న కారును ఒక్కసారిగా ఢీకొట్టింది. వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని.. పైలట్, కారు డ్రైవర్‌ను రక్షించాయి.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Also Read: Tiger 3 Review: సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
బుల్లి విమానం నెమ్మదిగానే కారును ఢీ కొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలు కావడంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటల పాటు మూసివేశారు. ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు దర్యాప్తు ఆరంబించారు. అమెరికాలో గత కొన్నేళ్లుగా చిన్న విమానాల ప్రమాదాల సంఖ్య భారీగా ఉన్నాయి. 2019లో 988 ప్రమాదాలు జరగ్గా.. 307 మంది మృతి చెందారు. 2021లో 939 ప్రమాదాలు జరగగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు.
🚨#WATCH: As a small plane overtakes the runway and crashes through a fence into a car
⁰📌#McKinney | #Texas⁰
A small Experimental Lancair IV-P Propjet (N751HP) plane sustained significant damage when it crashed into a car in McKinney, Texas, on Saturday afternoon. Following… pic.twitter.com/8j9h1ufv2q— R A W S A L E R T S (@rawsalerts) November 11, 2023
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?