ఢిల్లీ ముఖర్జీనగర్‌లో (Delhi) ఘోర విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని కారు (Car) బలి తీసుకుంది. ఇంటి ముందు చిన్నారి ఆడుకుంటుండగా.. డ్రైవర్ గమనించకుండా కారు ముందుకు పోనివ్వడంతో చక్రాల కింద నలిగిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మరణించిన చిన్నారి ఆర్యన్‌గా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదం జరిగిన తర్వాత.. ఇంట్లో నుంచి తల్లిదండ్రులు బయటకు రాగానే బాబు విగతజీవిగా పడి ఉన్నాడు. కారు డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరగా.. కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులు ఆస్పత్రి లోపలికి వెళ్లగానే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆస్పత్రికి చేరుకునేలోపే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి.. ముఖర్జీ నగర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనతో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.
दिल्ली के मुखर्जी नगर इलाके का 6 Feb मंगलवार का एक CCTV फुटेज सामने आया है जिसमे कर चालक ने ढाई साल के बच्चे को कार से कुचला। CCTV में साफ देखा जा सकता है कि कैसे बच्चे को सामने से कार से रौंदा। पुलिस ने मुकदमा दर्ज कर आरोपी महक बंसल को गिरफ्तार कर लिया।@DelhiPolice… pic.twitter.com/YOO2vPpWyE
— Atulkrishan (@iAtulKrishan1) February 8, 2024