Supreme Court: చలికాలం సమీపిస్తుందంటే చాలు.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.