Marijuana: గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో గంజాయి సాగు చేయడం నిషేధం. భారత్‌లోనే కాదు… ఆసియా దేశాల్లో గంజాయి సాగు చేసినా, తరలించినా, విక్రయించినా, వినియోగించినా నేరమే. కానీ.. థాయ్‌లాండ్ ప్రభుత్వం గంజాయి సాగుతోపాటు, దాని వినియోగాన్ని కూడా చట్టబద్ధం చేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గంజాయి వాడకాన్ని ప్రోత్సహించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం.. దానిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని మాత్రం నిషేధించింది. దీనిని ఉల్లంఘించిన వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, గంజాయి ఇప్పుడు చట్టబద్ధం కావడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన దాదాపు 4 వేల మందిని ప్రభుత్వం విడుదల చేయనుంది.
Also Read
వైద్యపరమైన ఉపయోగాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, నేటి నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేయాలని ఆ దేశ మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ నిర్ణయించారు.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..