CMR Engneering College : మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్‌రూముల్లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారు హాస్టల్‌లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకుని…