సాధారణంగా కుక్కలు అంటే ఇష్టపడని వారు ఉండరు.. కొందరైతే మరీ ఎక్కువగా ఇష్టపడతారు. వాటికి నచ్చే ఫుడ్ కానుంచి మొదలు పెడితే.. బెడ్ వరకు , కేర్ తీసుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక మనిషితో బీహెయిర్ చేసినట్లే చేస్తారు. ఎందుకంటే కుక్కల మీద ఉన్న ప్రేమ అలాంటిది. విశ్వాసంతో ఉంటాయన్న నమ్మకం. ఓ కుర్రాడు పెంచుకున్న కుక్క కోసం ఏకంగా ఇళ్లే కట్టేశాడు. ఎక్కడనుకుంటున్నారా కాలిఫోర్నియాలో. కుక్కల కోసం డాగ్ హౌస్ ఏర్పాటు చేయడం చూస్తుంటాం గానీ.. 20వేల డాలర్లు పెట్టి కుక్క కోసం ఖరీదైన ఇల్లు నిర్మించాడు. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. అతను మామూలు జంతు ప్రేమికుడు కాదని.
Also Read : Meira Kumar: హైదరాబాద్ కు మాజీ స్పీకర్ మీరా కుమార్.. ఘన స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి
యూట్యూబర్ గా పని చేస్తున్న బ్రెంట్ రివెరా అనే 25 ఏళ్ల యువకుడు.. తన కుక్క చార్లీ కోసం లగ్జరీ హౌస్ ను నిర్మించాడు. అది కూడా స్పెషల్ గా ఉండాలని దారి మొదటి పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అతను యూట్యూబర్ కావడంతో.. దీన్నంతా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే తాను ఎంతగానో ప్రేమించే తన మొదటి పెంపుడు కుక్క చనిపోయిందని.. ఆ తరువాత చార్లీని పెంచుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. మొదట చార్లీ కోసం కార్డు బోర్డులతో చిన్న ఇల్లు నిర్మించారు. ఆ తర్వాత దాన్ని ఫస్ట్ బర్త్డే సందర్భంగా విలాసవంతమైన ఇంటిని నిర్మించాలనుకున్నాడు. దీనికోసం స్నేహితుడి సహాయంతో.. 20వేల డాలర్లు అంటే దాదాపుగా రూ. ఆరు లక్షలతో ఇళ్లు కట్టాడు.
Also Read : Aunty Video Call: ఆంటీ మత్తులో అతను.. వీడియో కాల్ లో బట్టలు విప్పి
అంతేకాదండోయ్ ఒక మనిషికి ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో.. ఆ కుక్కకు కూడా అలాంటి విలాసవంతమైన సౌకర్యాలు అమర్చాడు. బెడ్, కాఫీ టేబుల్, ఫ్రిడ్జ్, టీవీ, బీన్ బ్యాగ్ లాంటి సౌకర్యాలు అన్ని అమర్చాడు యువకుడు. కుక్క టీవీ చూస్తుందా అంటే.. అందులో కేవలం దానికి నచ్చేవి ఎప్పుడు ప్లే అయ్యేలా ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక ఇంటి బయట బంగారు అక్షరాలతో చార్లీ హౌస్ అని రాయించాడు. ఆ తర్వాత.. చార్లీని తీసుకువచ్చి.. ఆ కొత్త ఇంట్లోకి సర్ప్రైజ్ గా పంపించాడు. అది ఎగ్జైట్ అవుతుంటే చూసి సంబరపడిపోయాడు. ఇదంతా నెట్టింట్లో వైరల్ అవుతుండటంతో.. చూసినవారు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనుషులకే లేని విలాసవంతమైన జీవితం.. కుక్కలకు ఎందుకని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు పిచ్చి పీక్స్ కు పోయిందంటూ.. ఇంకొందరేమో స్వేచ్ఛగా తిరిగే జీవిని బంధించి.. స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.