అనసూయ భరద్వాజ్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ యాక్టర్ గా ఎదిగింది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. అయితే వరుస సినిమా షూటింగ్ ల నుంచి బ్రేక్ తీసుకోని ఫ్యామిలీ తో సరదాగా ట్రిప్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం కాలిఫోర్నియా వీధుల్లో విహరిస్తున్న ఈ భామ తన హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.. తాజాగా తన ఫ్యామిలితో కలిసి ట్రిప్ లో దిగిన ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులకు షేర్ చేశారు. అందమైన నగరంలో అనసూయ ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు. తాజాగా అనసూయ తన లేటెస్ట్ లుక్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
స్లీవ్ లెస్ టాప్ లో అనసూయ బోల్డ్ పోజులిస్తూ రెచ్చగొడుతుంది.ఎద పై ఉన్న టాటూ హైలెట్ కావడం తో నెటిజన్స్ కాస్త హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.మరో వైపు అనసూయ సినిమా కెరీర్ కూడా అద్భుతం గా సాగుతుంది.. ఇటీవల ఆమె నటించిన విమానం సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.విమానం మూవీలో అనసూయ వేశ్య గా నటించి మెప్పించింది..అలాగే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగమార్తాండ సినిమాలో హైటెక్ కోడలిగా నటించి మెప్పించింది.. ఈ సినిమాలో అనసూయ నటనకు మంచి పేరు వచ్చింది.ప్రస్తుతం ఈ భామ పుష్ప 2 సినిమాలో నటిస్తుంది.. పుష్ప సినిమా లో దాక్షాయణిగా కనిపించి మెప్పించిన అనసూయ పుష్ప 2 లో కూడా ఎంతగానో అలరించబోతున్నట్లు సమాచారం.. పుష్ప 2 లో అనసూయ పాత్రను దర్శకుడు సుకుమార్ ఇంకా పవర్ ఫుల్ గా రూపొందిస్తున్నట్లు సమాచారం.