Carbide gun: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రజలు తమ కుటుంబాలతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, కొందరికి మాత్రం దీపావళి విషాదాన్ని మిగిల్చింది. కంటిచూపు కోల్పోయేలా చేసింది. ‘‘కార్బైడ్ గన్’’ వల్ల మధ్యప్రదేశ్‌లో 122 మంది పిల్లలు గాయపడ్డారు. వీరిలో 14 మంది కంటి చూపు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గాయపడ్డారు. ఈ కార్బైడ్ గన్‌ను ‘‘దేశీ ఫైర్ క్రాకర్ గన్’’గా కూడా పిలుస్తారు. Read Also: Chiranjeevi : చిరంజీవి…
వేసవి సీజన్ వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.
బొప్పాయి భారతదేశంలో విరివిగా తినే పండు. మెత్తగా, తీపిగా, జ్యూసీగా ఉండే ఈ పండును చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే దీన్ని తినడానికి పెద్దగా శ్రమ అవసరం లేదు. బొప్పాయి రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన బొప్పాయిలో ఆ పోషకాలన్నీ ఉంటాయి.