అస్సాం వరదలు ఆ రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఓ వైపు వర్షాలు, మరోవైపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదల వల్ల 173 మరణించారు. ఒక్క శుక్రవారమే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కాచార్ జిల్లాలో ఆరుగురు, నాగోన్ జిల్లాలో ముగ్గురు, బార్ పేటలో ఇద్దరు, కరీంగంజ్, కోక్రాజార్, లఖింపూర్ లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 30 జిల్లాల్లో 29.70 లక్షల మంది వరద…
అకాల వర్షాలు అస్సాంను ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల అస్సాంలోని 6 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించాయి. వాగులు, నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరుగిపడుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారి అస్సాంను వరదలు ముంచెత్తాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నిన్న డిమా హసావో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది.…