కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇబ్బందులతో సతమతం అవుతోన్న టెలికం రంగానికి ఊరట కలిగిస్తూ.. టెలికం సంస్థల్లో వంద శాతం విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తూ ఇస్తూ ఇవాళ నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్.. మోడీ సర్కార్ తాజా నిర్ణయంతో ప్రైవేట్ టెలికం రంగ సంస్థలైన వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ వంటి సంస్థలకు ఊరట కలగనుంది.. అప్పుల్లో కూరుకుపోయిన టెలికం రంగానికి ఊరట కలిగించేలా ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది నరేంద్ర…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 16వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది… ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. ఈనెల 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.. ఇక, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహం, ప్రతిపక్షాల…
తాలిబన్లు ఎలాంటి వారో అందరికీ తెలుసు. తాలిబన్లు చెప్పేది ఒకటి చేసేది మరోకటి అనే విషయం అందరికీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకున్నాక అందరిని సమానంగా చూస్తామని, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పటికీ దానిని నిలబెట్టుకుంటారు అని ఎవరికీ నమ్మకం లేదు. అందుకే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. అందరికీ కేబినెట్‌లో సమానంగా అవకాశాలు ఇస్తామని చెప్పిన తాలిబన్లు ఒక్క మహిళకు కుడా అవకాశం కల్పించలేదు. పైగా…
కన్నడ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. కాంగ్రెస్-జేడిఎస్ పార్టీలు కలిసి గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంవత్సరం తిరగక ముందే ఆ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేసీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా రెండేళ్లు పరిపాలన సాగించారు. వయసు రిత్యా ఆయన పదవి నుంచి తప్పుకొవడంతో బొమ్మైని ముఖ్యమంత్రి పదవి లభించింది. పాత మంత్రి వర్గాన్ని కొనసాగించకుండా తనదైన ముద్ర వేసుకోవడానికి మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి బొమ్మై ప్రక్షాళన చేశారు. 18…
తెలంగాణలో ప్రస్తుతం దళితబంధుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అర్హులైన పేద దళిత కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సాయం ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దీని విధివిధానాలపై ఆయా వర్గాలతో చర్చలు జరిపారు. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇవాళ జరిగే కేబినెట్ భేటీలోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు… ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత…
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి కిందే ముగిసింది. వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద కెబినెట్ లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై కెబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం…
లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్… ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్, సడలింపులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుత లాక్‌డౌన్ ఈ నెల 9వ తేదీతో ముగియనుండగా.. మరో 10 రోజుల పాటు పొడిగించారు.. ఇదే సమయంలో.. సడలింపులు సమయాన్ని పెంచుతూ.. లాక్‌డౌన్ సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్ తాజా నిర్ణయం ప్రకారం.. ఈ నెల 10వ తేదీ…
జూన్ 9 వ తేదీన తెలంగాణలో లాక్‌డౌన్ ముగియబోతున్నది. మే 31 నుంచి పదిరోజులపాటు లాక్‌డౌన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో జూన్ 8 వ తేదీన తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కాబోతున్నది. జూన్ 8 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. ఈ…