అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీ అయింది. ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జగన్ మోసపు రెడ్డి పాలన వల్లే అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం ఏర్పడిందన్నారు. జగన్ ఒక అపరిచితుడు.. తన రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్ అవుతోంది. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్ట్ కు శాపంగా మారాయి. నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర కేబినెట్… ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశాలో… ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది.. మంత్రివర్గ ఆమోదంతో 31 శాతంగా ఉన్న డీఏ 34 శాతానికి పెరగనుంది.. పెరుగుతున్న ఇంధన ధరలు మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఉపశమనం కలిగిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా డీఏ పెంపు నిలిచిపోయింది.. ఉద్యోగుల జీతాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని…
సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈమధ్యకాలంలో ఆయన వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకెళ్ళారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేపడుతున్నారు. ఆయన వెంట భార్య, కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్ వున్నారు. ఉదయం 11గంటల 20 నిముషాల టైంలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చారని తెలుస్తోంది. సోమాజిగూడలో వున్న సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్ళారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. ఆస్పత్రి వద్ద…
తొందరపడి మాట్లాడతారు.. ఆ తర్వాత నాలుక కర్చుకుంటారు. ఇది అధికారపార్టీలో ఓ మంత్రిగారిపై ఉన్న అభిప్రాయం. అలాంటి అమాత్యులవారు ఇప్పుడు అస్సలు పెదవి విప్పడం లేదు. అధిష్ఠానం వద్ద అక్షింతలు లేవు. వేడి తగ్గిందో ఏమో సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనం కూడా చర్చగా మారిపోయింది. ఇంతకీ ఎవరా మంత్రి? నోటి దురుసు వల్ల పదవి పొడిగింపు కష్టమనే టాక్ నారాయణ స్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి…
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించారు. ఆన్‌లైన్ క్లాసులు కంటిన్యూ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నైట్ కర్ఫ్యూను అమలు చేయాలనే అలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనిపై నేడు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశంలో…
తెలంగాణ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా? పార్టీ పరిశీలనలో ఉన్న పేర్లేంటి? వడపోతల్లోకి వచ్చి పోతున్న నాయకులు ఎవరు? సీఎం కేసీఆర్ వేస్తున్న సామాజిక లెక్కలేంటి? ఒక్క బెర్త్ భర్తీకి వడపోతలు మొదలయ్యాయా? అధికార టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం పదవుల భర్తీ జాతర నడుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల సందడి పూర్తి కాగానే.. పలు దఫాలుగా నామినేటెడ్ పదవులను పార్టీ నేతలకు కట్టబెట్టారు. ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టులు చాలానే ఉన్నాయి. వాటి కోసం…
అమ్మాయి పెళ్లికి ఏది సరైన వయసు? నలబై ఏళ్ల క్రితం ఆడ పిల్ల వివాహ వయస్సు పదిహేనేళ్లు. తరువాత దానిని పద్దెనిమిదికి పెంచారు. ఇక ముందు మగపిల్లలతో సమానంగా ఆడపిల్ల పెళ్లి వయస్సు కూడా 21 ఏళ్లుగా సర్కార్ చట్ట సవరణ చేయనుంది. జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫార్సులను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇక పార్లమెంట్ ఆమోదం పొందటమే తరువాయి. అంటే ఇకపై మన దేశంలో టీనేజ్ వివాహాలకు ఛాన్స్ లేదు. బాల్య…
వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎస్ సమీర్ శర్మ భేటీ అయ్యారు. కేబినెట్ నిర్ణయాల అమలు, పెండింగ్ అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎం ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యలపై శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని సమావేశంలో కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. నవంబరు 30 తేదీనాటికల్లా కరోనా కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల చేపట్టాల్సిందిగా మెమో జారీ చేశారు. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి డీపీసీల నియామకంపై చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ సూచనలు…
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్‌లో ప్రస్తావించినట్టుగానే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాడ్‌బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.30,600 కోట్ల గ్యారెంటీ ఇస్తోందని ప్రకటించారామె.. బ్యాంకింగ్‌రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నామన్న నిర్మలా సీతారామన్.. ఇప్పుడిప్పుడే బ్యాంకింగ్ రంగం కోలుకుంటుందన్నారు.. ఇక, ఎన్‌పీఏలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు నిర్మలా సీతారామన్.. 2018 నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశామని…