Assembly By Poll Result: బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10వ తేదీన జరిగిన ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఇవాళ (శనివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి కొన్ని నెలలు కాకముందే ఉప ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఏకంగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గతంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సంగ్రూర్ లోక్ సభ స్థానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ స్థానం నుంచి శిరోమణి అకాలీదళ్(అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ గెలుపొందారు. హోరాహోరీగా జరిగిన పోరులో ఆప్ అభ్యర్థి గుర్‌మైల్ సింగ్‌పై 5,800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.…
దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3 లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. తాజాగా ఆదివారం రోజు ఓట్లను లెక్కించారు. ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. త్రిపురలో అగర్తల, జుబరాజ్ నగర్, సుర్మా, బర్డోవాలి( పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గాలకు, జార్ఖండ్ లోని మందార్, ఢిల్లీలోని రాజిందర్ నగర్, ఏపీలోని ఆత్మకూర్ అసెంబ్లీ నియోజవర్గాలతో పాటు పంజాబ్ లోని సంగ్రూర్ లోక్ సభ, ఉత్తర్…