పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ మేరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించింది. లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి చనిపోయారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కేరళ చేరుకున్నారు. రాష్ట్ర నాయకులు భారీ స్వాగతం పలికారు. బుధవారం వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మా రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. ఈ మేరకు ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నామినేషన్‌ల దాఖలుకు చివరి తేదీ మే 19గా ఉంటుంది. మే 30న ఉప ఎన్నిక జరగనుంది. ఆ రోజు…
హుజురాబాద్ లో టీఆర్ఎస్ దే నైతిక విజయం అని ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నన్ను ఓడించాయన్నారు. ఓటమికి నేనే నైతిక బాధ్యత వహిస్తున్నానని ప్రకటించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఈ ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ కు అభినందనలు తెలిపారు. ఇక, దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోరాడుతాయి… కానీ, హుజురాబాద్ మాత్రం కలసి పని చేస్తాయని…
ఆ ఒక్క ఉపఎన్నిక.. అధికారపార్టీలోని మిగతా ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఒత్తిళ్లను వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. నిధుల కోసం నియోజకవర్గం దాటి ప్రభుత్వ పెద్దల దగ్గర క్యూ కట్టక తప్పడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ ఫీట్లు.. ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చగా మారాయి. ప్రభుత్వ పెద్దల దగ్గరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ! హుజురాబాద్ ఉపఎన్నికపై టీఆర్ఎస్ పూర్తిగా ఫోకస్ పెడితే.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట వారిని ఇరుకున పెట్టే వర్గాలు…
ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా హుజూరాబాద్ చుట్టే తిరుగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ విషయంలో పెద్ద సస్పెన్స్ ఏమీ లేదు ..కానీ కాంగ్రెస్‌లోనే ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి ఎవరని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఐతే, కొండా సురేఖ పేరు ఖరారు అయిందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందటమే ఆలస్యమట. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ మూడు పేర్లతో హైకమాండ్‌కు నివేదిక…
హుజూరాబాద్ ఉప ఎన్నికపై అధికార పార్టీ ఫోకస్ పెంచింది. టైమ్ దగ్గరవుతున్నందున అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికే తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ఎవరన్నది కూడా దాదాపు ఫైనల్ అయింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం రేవంత్ వెయిటింగ్. కాగా బరిలో తామూ ఉంటామని వైఎస్ షర్మిల ఇటీవలే ప్రకటించారు. దాంతో వైఎస్సార్‌టీపీ అభ్యర్థి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉంటారని తేలిపోయింది. ఇక బీఎస్పీ ఇప్పటి…
తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా ఆ పార్టీలకు పరీక్షే. ఇప్పుడు కొత్తగా మరో పార్టీ ఆ జాబితాలో చేరింది. ఉనికి కోసం క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన పరిస్థితి. ఎన్నికల్లో పోటీ చేస్తాయో లేదో తెలియదు. బరిలో ఉన్నవారికి మద్దతిస్తాయో లేదో కూడా అర్థం కాదు. మొత్తానికి గుంపులో గోవిందగా మారిపోయాయి. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ అంతేనా? హుజురాబాద్‌లో పోటీ చేస్తాయా లేదా? తెలంగాణాలో కొన్నిపార్టీలకు ఎన్నికలంటేనే దడ. ఒక రాజకీయపార్టీగా అలా నడిపించేద్దాం అని అనుకుంటున్న సమయంలో హుజురాబాద్ బైఎలక్షన్…