మోడీ సర్కారు రాజ్యాంగ పునాదులు కూల్చేస్తుందlr, బీజేపీకి 2019 ఫలితాలు రావనే భయం పట్టుకుందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భయం లేకుంటే కేజ్రీవాల్.. సోరేన్ లను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు కకావికాలం చేసి.. బలహీన పరిచే ఎత్తుగడలో బీజేపీ ఉందని, బీజేపీ బలంగానే ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకులను చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారన్నారు. నీతికి నిర్వచనం మార్చేశారు మోడీ అని,…
మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. 370 సీట్లు గెలుస్తాం అని బీజేపీ స్పష్టంగా చెప్తోంది... జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కాబట్టి బీజేపీ అలా అంటుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ను విభజించి ముక్కలు చేశామని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, విదేశీ సంస్థలకు దేశాన్ని అమ్మడం గొప్ప విజయంగా బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చెయ్యడం కూడా గొప్ప…
మోదీకి, అమిత్ షా కి తెలీకుండా చంద్రబాబును బొక్కలో వేయలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనసేన నాయకుడు మోడీని పొగడటమే సరిపోయింది బీసీ సభలో అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఈనెల 15న విజయవాడలో జరుగనున్న ప్రజా రక్షణ భేరి సభ విజయవంతం కోసం సీపీఎం సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి గౌరవం సంపాదించే పరిస్థితి లేదు అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. బీజేపీకి జై కొడుతూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారు ఆయన ఆరోపించారు. బీజేపీని భుజాన మోస్తున్నారు.. వివిధ విధానాలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోంది..