వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో చల్లదనం కోసం మజ్జిగ తాగుతుంటాం. వేడి వాతావరణంలో దాహం, అలసట పోవాలంటే మజ్జిగ తాగడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. మజ్జిగ శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది.
Butter Milk : భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో భోజనంతో పాటు ఒక గ్లాసు మజ్జిగను తీసుకుంటారు. సాధారణంగా, వేసవిలో మజ్జిగ వినియోగం పెరుగుతుంది, ఎందుకంటే ఇది వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.