Buttermilk Benefits : మజ్జిగతో జుట్టు, చర్మానికి కూడా ఉపయోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవిలో చల్లదనం కోసం మజ్జిగ తాగుతుంటాం. వేడి వాతావరణంలో దాహం, అలసట పోవాలంటే మజ్జిగ తాగడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. మజ్జిగ శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది. ఇంత వరకే మనకు తెలుసు కాని.. మజ్జిగ తాగడం వల్ల జుట్టు, చర్మానికి కూడా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా పెగాలంటే మజ్జిగలో ఏమేం కలపాలో తెలుసుకుందాం.. మజ్జిగలో హైడ్రేషన్, పోషకాలు ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు, చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది జుట్టు, చర్మంలో తేమను కోల్పోకుండా చేస్తుంది. జుట్టు మెరుస్తూ, చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
READ MORE: Namburu Sankar Rao: రాబోయే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తా..
Also Read
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
మజ్జిగా ఎప్పుడు తయారు చేసుకునేలా కాకుండా.. ఇలా ప్రయత్నించండి. మజ్జిగ సిద్ధం చేసేటప్పుడు కరివేపాకులను జోడించాలి. ఎందుకంటే కరివేపాకు పోషకాల భాండాగారం. కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కరివేపాకు, మజ్జిగలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతుంది. మజ్జిగ, అల్లంలోని శీతలీకరణ గుణాలు చర్మపు చికాకు, దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి, వడదెబ్బ, ఇతర చర్మపు చికాకులు ఉన్నవారికి మజ్జిగ సమర్థవంతమైన చర్మ సంరక్షణకు ఇది ఉపయోగకరం. దురదను సైతం తగ్గిస్తుంది. పూర్వం ప్రజలు భోజనం తర్వాత మజ్జిగ తాగేవారు. నేటికీ కూడా కొంతమంది భోజనం తర్వాత తాగుతారు. ఎందుకంటే జీర్ణక్రియను సులభతరం చేయడానికి మజ్జిగ మంచిది.. కప్పు మజ్జిగలో గుప్పెడు కరివేపాకు, రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఐదారు చెర్రీలు వేసి బాగా కలపాలి. కొన్ని కరివేపాకు వేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు వేస్తే మజ్జిగ రెడీ. పైన చెప్పిన పదార్థాలను కలిపి మజ్జిగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నిఫుణులు చెబుతున్నారు. ఎప్పుడూ చేసుకునే లాగా కాకుండా ఈ సారి మజ్జిగ తయారు చేసేటప్పుడు పైన చెప్పిన కొన్నింటిని కలపండి.
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!