Bus Overturns in Chhattisgarh:ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మోహ్లా మన్‌పూర్‌లో బస్సు బోల్తా పడింది. చిన్నారులతో సహా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. దోండి లోహరా ప్రాంతం నుంచి కురేత గ్రామానికి బయలుదేరిన బస్సు శుక్రవారం బోల్తా పడటంతో ప్రయాణికులు గాయపడ్డారు.
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్రంలో ఓ బస్సులో ప్రమాదానికి గురయింది. ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈరోజు జరిగిన శివషాహి బస్సు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Bus Accident: తమిళనాడు నుంచి కేరళలోని శబరిమలకు అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 64 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హల్దియా-మెచెడా రాష్ట్ర రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లోని శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోవడంతో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్వామా జిల్లాలో బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అఫ్ఘాన్‌లోని తఖర్ ప్రావిన్స్‌లో బస్సు బోల్తా పడిన ఘటనలో కనీసం 17 మంది బంగారు గని కార్మికులు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లు నివేదికలు తెలిపాయి.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగ్రౌలీ జిల్లాలో పెళ్లి బృందం సభ్యులతో నిండిన బస్సు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, దాదాపు 50 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.