Bus Accident : మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. బస్సు నదిలో పడి 22 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున వంతెన పై నుంచి బస్సు పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు 31మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఖోరేగావ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. డోంగార్‌గావ్ సమీపంలోని బరోడ్ నదిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సు ఖోరేగావ్ నుంచి ఇండోర్‌కు వెళ్తోంది. వంతెనపై బస్సు అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టి నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50మంది ఉన్నారు. క్షతగాత్రులను ఖోరోగావ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Read Also:Vande Bharat: ఏమైంది రా.. ఎందుకురా రాళ్లదాడులు? ఎవరిమీద కోపం
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు రావడానికి ముందే గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టి కొందర్ని బయటకు తీశారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం ఇండోర్‌కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 వేలు ఆర్ధిక సాయం అందజేయనున్నట్టు తెలిపారు. అటు కేంద్రం కూడా రూ.2 లక్షల మేర ఆర్ధిక సాయం ప్రకటించింది. క్షతగాత్రుల వైద్యానికయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Read Also:Errabelli Dayakar: విధుల్లోకి రండి మంత్రి విజ్ఞప్తి.. తగ్గేదే లే అంటున్న జూ.పంచాయతీ కార్యదర్శులు
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!