విజయదశమి వచ్చిందంటే చాలు.. అంతా జోష్‌లోకి వెళ్తారు.. అయితే, కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం.. కర్రల సమరం ప్రత్యేకంగా నిలుస్తోంది.. ఈ సారి పోలీసులు భారీగా మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో స్వయంబుగా వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో పాఠ్యంశంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ఎంపిక చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో టెన్త్ కొత్త పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు దక్కింది. ప్రతియేటా దసరా రోజు హోలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో కర్రల సమరం గురించి ఈ పాఠ్యాంశంలో పొందుపర్చబోతున్నారు.