హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని నగర అగ్నిమాపక శాఖ తెలిపింది. సంఘటన స్థలంలోనే తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు, తరువాత నలుగురు ఆసుపత్రిలో మరణించినట్లు నిర్ధారించారు. కనీసం 15 మంది గాయపడినట్లు తెలిపారు. దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Also Read:RSV virus Symptoms: జలుబు తీవ్రత పెరిగితే ఈ…
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం భారీ నష్టా్న్ని మిగిల్చింది. తాజాగా గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన జరిగింది.
Fire Accident : నగరంలోని మీర్‌చౌక్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మీర్‌చౌక్ ప్రాంతంలోని ఓ నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి నిర్మాణం తేడాగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఊపిరాడక 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు…
Fire Accident : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.…
కువైట్ అగ్నిప్రమాదంలో 50 మంది విదేశీ కార్మికులను బలి తీసుకున్న కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులతు అరెస్ట్ చేశారు. గత బుధవారం జరిగిన ప్రమాదంలో 50 మంది భారతీయులు, ఫిలిప్పీన్స్ ప్రాణాలు కోల్పోయారు.
కువైట్‌లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఇండియా నుంచి తమది కాని దేశం వెళ్లిన కార్మికులు.. నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ ఘోర విషాదం కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో చోటుచేసుకుంది.
కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 43 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.