హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని నగర అగ్నిమాపక శాఖ తెలిపింది. సంఘటన స్థలంలోనే తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు, తరువాత నలుగురు ఆసుపత్రిలో మరణించినట్లు నిర్ధారించారు. కనీసం 15 మంది గాయపడినట్లు తెలిపారు. దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read:RSV virus Symptoms: జలుబు తీవ్రత పెరిగితే ఈ ప్రమాదం వస్తుంది..
రికార్డుల ప్రకారం, ఈ గృహ సముదాయంలో దాదాపు 2,000 ఫ్లాట్స్ ఉన్న ఎనిమిది బ్లాక్‌లు ఉన్నాయి, వీటిలో దాదాపు 4,800 మంది నివసిస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం మంటలు చెలరేగాయి, చీకటి పడిన తర్వాత అధికారులు అలారంను 5వ స్థాయికి పెంచారని, ఇది అత్యధిక తీవ్రత స్థాయి అని అగ్నిమాపక శాఖ తెలిపింది. రాత్రి పొద్దుపోయే వరకు మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయన్నారు. 128 అగ్నిమాపక వాహనాలు, 57 అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఆండీ యాంగ్ విలేకరులతో మాట్లాడుతూ, చనిపోయిన వారిలో ఒక అగ్నిమాపక సిబ్బంది ఉన్నారని, మరొకరు వేడి కారణంగా అలసటకు చికిత్స పొందుతున్నారని చెప్పారు.