దేశ రాజధాని ఢిల్లీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జహంగీర్‌పురి పారిశ్రామిక ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఐదు అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇతర సివిల్ ఏజెన్సీ ఉద్యోగుల సహాయంతో శిథిలాలను తొలగించడం ప్రారంభించారు. శిథిలాల నుంచి నలుగురిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 10 మంది చిక్కుకున్నారు. అందులో ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
Tamil Nadu Rains: భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం మరోమారు అల్లాడిపోతోంది. దక్షిణ తమిళనాడులో కూరుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. తిరునెల్వెలి, టుటికోరిన్, టెంకాసి, కన్యాకుమారి జిల్లాల్లో కూరుస్తున్న కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్లు విద్యుత్ సరఫరా పూర్తిగా…
Building Collapse : ఉత్తర సిరియాలోని అలెప్పో నగరంలో ఓ భవనం పేక మేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 16 మంది భవన శిథిలాలలో చనిపోయారు. 4 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా చాలా మంది శిథిలాలలో చిక్కుకున్నారు.
ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు రాయలచెరువు లీకేజీలతో తిరుపతి జనం కంటిమీద కునుకులేకుండా పోతోంది. తాజాగా ఓ పాత భవనం కుప్పకూలింది. తిరుపతి భవానీ నగర్ లో కుప్పకూలింది మూడంతస్థుల భవనం. వర్షాలకు పది రోజులుగా పాత భవనం నానిపోయింది. శిథిలావస్ధకు చేరడంతో రెండేళ్ళ క్రితమే ఇంటిని ఖాళీచేశాడు యాజమాని. ఇంటిలో, సమీప ప్రాంతాలలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇదిలా వుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. రాత్రి తిరుపతి, శ్రీకాళహస్తి,సత్యవేడు,…