Building Collapsed : పండగ పూట విషాదం.. విశాఖలో కూలిన కుప్పకూలిన భవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Building Collapsed : కొత్త సంవత్సరం విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్ సమీపంలోని రామజోగి పేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. మరో ఆరుగురిని రక్షించి కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పురాతన భవనం కూలినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. వారికి ఎటువంటి ప్రాణాప్రాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని గాయపడిన వారు అంటున్నారు. వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొంది.
Read Also: Cyber Crimes : పెరుగుతున్న సైబర్ మోసాలు.. ఇలా చేస్తే మీరు సేఫ్
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బిల్డింగ్ కుప్పకూలడంతో బాలిక సాకేటి అంజలి (15) అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. రామకృష్ణ మిషన్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది అంజలి. ప్రస్తుతం ఆమె సోదరుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. శిథిలాలలో మరో యువకుడు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. G+ 2 భవంతిలో రెండు కుటుంబాలతో పాటు ఇద్దరు బ్యాచిలర్స్ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. భవనం లో మొత్తం తొమ్మిది మంది ఉన్నట్టు సమాచారం. వారిలో అంజలి చనిపోగా ఆరుగురిని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. మరో ఇద్దరి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు ఎన్టీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది. కాగా నిన్న (మార్చి 23) అంజలి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం విశేషం. ఇంతలోనే ఈ దుర్ఘటన చేసుకుంది. దీంతో అంజలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా శిథిలాల నుంచి మరొక మృత దేహం వెలికితీశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నూడిల్స్ షాప్ సహాయకుడు బీహార్ కు చెందిన చోటుగా గుర్తించారు.
Read Also: KA Paul Ugadi Panchangam: కేఏ పాల్ ఉగాది పంచాంగం.. అధికారంలోకి వచ్చేది ఎవరో తేల్చేశారు..!
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!