Shabbir Ali : ఫార్ములా ఈ రేస్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్‌కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానని, కోర్టులో మాత్రం తనకేం సంబంధం లేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేటీఆర్‌కి నీతి లేదు అని ఆయన తీవ్రంగా…
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 80 బీసీ సంఘాల నాయకులు కూడా సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. నీది నాలుక తాటి మట్ట.. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబంతో కూడి పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా అని దుయ్యబట్టారు. అవకాశవాది నుంచి అవినీతి మాట రావడం సిగ్గుచేటు అని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజయ్య అన్నారు.
కవిత సీఎం.. సీఎం కవిత.. అంటూ చేసిన స్లోగన్స్ పార్టీలో వెయ్యి ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయట. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్లో సీఎం అభ్యర్థి ఎవరన్నది అవసరం లేదు. పార్టీ అధికారంలో లేదు, అధ్యక్షుడు కేసీఆర్ యాక్టివ్‌గా ఉన్నారు. కానీ... ఆయన వారసత్వ వ్యవహారమే చాలా రోజులుగా నలుగుతోందట బీఆర్ఎస్ వర్గాల్లో. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎవరంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అసలదేం ప్రశ్న?
ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్సీ కవిత జవాబు చెప్పి ధర్నా చేయాలని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలను వంచించడమే కాకుండా వారికి అందాల్సిన నిధులను ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని ఆరోపించారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లింది.. కేటీఆర్ కూడా రేపో మాపో అరెస్టు అవుతారని అన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ పుష్ప (అల్లు అర్జున్) అరెస్ట్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. RRR అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని ఎంపీ దుయ్యబట్టారు. RRR విషయంలో దోచుకునే, దాచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని అభిప్రాయపడ్డారు.
KP Vinekananda : మెట్రో ప్రాజెక్టును శామీర్ పేట, మేడ్చల్ వరకు విస్తరిస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం మెట్రో మూడో దశ విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకుందన్నారు కేపీ వివేకానంద. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో మూడో దశ విస్తరణకు కన్సల్టెంట్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వం నియమించిందని, రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చి రాగానే కేసీఆర్ ఆనవాళ్లు…
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పని చేస్తున్న 6,000 మంది ఆర్పీలకు వెంటనే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అయినా ఆర్పీలకు పెండింగ్ జీతాలను చెల్లించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా.. వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు…
గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పడుతున్న భాదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలోని ఓ గురుకుల విద్యార్థినులు తమకు సరిగా అన్నం కూడా పెట్టడం లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణ రాష్ట్రంలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా? అంటూ ఆవేదన…