Deputy CM Bhatti: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల కోసం చట్టాలు చేసి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక, చట్టాలను అమలు చేయించుకునే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
రైతు బంధు ఇవ్వలేదని, ఇళ్లు ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి టీం దుష్ప్రచారం చేస్తుంటుంది.. వారి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్పారు. అలాగే, యోగ్యమైన భూమి ఉన్న వారందరికీ రైతుబంధు అందిస్తాం.. కానీ, రియల్ ఎస్టేట్ భూములకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
దానం నాగేందర్... గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయనది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం అలవాటని చెప్పుకుంటారు. పార్టీలు, లాయల్టీలు జాన్తానై.. పని జరగడమే మనకు ముఖ్యం అన్నట్టుగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఎథిక్స్, యాలక్కాయలు తర్వాత సంగతి.... ముందు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాల్రా భై... అంటారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆయన మీదున్న అభిప్రాయం అట. అందుకు తగ్గట్టే... తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా వేసుకున్న కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి...…
ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిన్న కేటీఆర్‌ను ఏసీబీ 7 గంటలు విచారించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. ఏసీబీ విచారణకు సంబంధించి విషయాలను కేటీఆర్ కేసీఆర్‌కు వివరించారు.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం.. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్లో తనను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తాజాగా.. కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది.
కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్‌కు ఊరట లభించలేదు.. అందుకే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్‌ను దుయ్యబట్టారు.
KTR : ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం నందినగర్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్, ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే అధికారులు అతనిపై విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ముగ్గురు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను కీలకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ తరఫు న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. విచారణ సందర్భంగా పలు అంశాలను చర్చకు…