KTR : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. భట్టి విక్రమార్క rతన “రేషన్ కార్డు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి నాలుగు పథకాలను మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తాం” అనే ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఒక గ్రామానికే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పరిమితమా? అని ప్రశ్నించారు. ట్విట్టర్ (ఎక్స్ )లో కేటీఆర్.. ‘ భట్టి గారు మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా ? మండలానికి ఒక గ్రామంలోనే గ్యారెంటీ కార్డులు ఇచ్చారా ? మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా ? మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా ? మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా ? నాడు “అందరికీ అన్నీ..” అని.. నేడు “కొందరికే కొన్ని..” పేరిట మభ్యపెడితే నాలుగు కోట్ల తెలంగాణ మీ నయవంచనను క్షమించదు..’ అని ఆయన అన్నారు.
Bhatti Vikramarka:”తెలంగాణకు అన్యాయం” పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం రియాక్షన్…
అంతేకాకుండా..’ఎన్నికలప్పుడు..రాష్ట్రంలోని ప్రతి మండలం.. ప్రతి గ్రామంలోని.. ప్రతి ఇంటా.. అబద్ధపు హామీలను ఊదరగొట్టి.. “వన్ ఇయర్” తరువాత “వన్ విలేజ్” అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే.. ప్రతిపక్షంగా ఇంకో నాలుగేళ్లు.. ఓపిక పట్టడానికి మేము సిద్ధం కానీ..ఏరు దాటక తెప్ప తగలేసే.. మీ ఏడాది దగా పాలన చూసిన తరువాత ఆగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు.. గుర్తుపెట్టుకోండి.. “పథకాలు రాని గ్రామాల్లో..” రేపటి నుంచి.. “ప్రజా రణరంగమే..!!”‘ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.