Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదని, చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 40,000 రేషన్ కార్డులు మాత్రమే జారీ చేసిందని, అయితే తమ ప్రభుత్వం లక్షల్లో కార్డులు ఇవ్వబోతుందన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న లిస్టు తుది జాబితా కాదని, అది కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తుల పరిశీలన ఐదేళ్ల పాటు జరుగుతుందని వివరించారు.
Uber And Ola: “ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు వేర్వేరు ధరలు”.. ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు..
కృష్ణా జలాల విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, మన హక్కుల్ని ఇతరులకు అప్పగించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలు వివరించాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు.
ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని, అర్హులందరికీ అందే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు. సామాజిక ఆర్థిక సర్వే, ప్రజా పాలన దరఖాస్తులు, కులగణన, అలాగే గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అందిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
Buddha Venkanna: టీడీపీకి దశ, దిశ లోకేష్ మాత్రమే.. చంద్రబాబు తర్వాత ఆయనే సీఎం..